VIDEO: విజయవంతంగా ముగిసిన పాదయాత్ర
SRD: నారాయణఖేడ్ పరిసర ప్రాంతాలకు చెందిన దత్త దీక్ష భక్తులు గానుగాపూర్ దత్త క్షేత్రానికి వారం రోజులపాటు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు బుధవారం రాత్రి దత్తాత్రేయ క్షేత్రానికి చేరుకున్నట్లు నిర్వాహకులు వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు దత్త క్షేత్ర సన్నిధానం వద్ద పాదయాత్రికులు ఆనందోత్సవాలతో నృత్యాలు చేశారు.