VIDEO: అకాల వర్షంతో మామిడి రైతుల ఆందోళన

VIDEO: అకాల వర్షంతో మామిడి రైతుల ఆందోళన

CTR: కాణిపాకంలో అకాల వర్షం కురిసింది. దీంతో పరిసర ప్రాంతాల మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత, పిందె దశలో ఉన్న మామిడి తోటలకు ఈ వర్షం నష్టం కలిగించే అవకాశముందని రైతులు చెబుతున్నారు. వర్షం కారణంగా పువ్వులు రాలిపోవడం, తేనెమంచు పురుగు, ఇతర రోగాలు పెరగవచ్చని వారు భయపడుతున్నారు. అధికారులు వెంటనే తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.