జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలం తోటపల్లిలో 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండ మండలం సిరిసనగండ్లలో 17.0 డిగ్రీలు, వెల్దండ మండలం బొల్లంపల్లిలో 17.1 డిగ్రీలు, వటవర్లపల్లి 17.2 డిగ్రీలు, తాడూరు లో 17.2 డిగ్రీలు, వెల్దండ 17.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.