రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: నందలూరు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. తలకు దెబ్బ తగలడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.