ఇచ్చిన హామీని నెరవేర్చిన పందెనపల్లి సర్పంచ్
NLG: కట్టంగూర్ మండల పరిధిలోని పందెనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు గ్రామంలోని మల్లికార్జున స్వామి గుడి దగ్గర బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం గ్రామ ప్రజల ముందు బోరు వేయించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.