రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

KRL: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు జిల్లా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి సూచనలు చేశారు.