19 నుంచి గుంటూరులో బ్యాడ్మింటన్ పోటీలు

GNTR: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 19, 20వ తేదీల్లో గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో 52వ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. సంబంధిత కరపత్రాలను జిల్లా కార్యదర్శి డీఎస్ఆర్, కమిటీ సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. అండర్-11 నుంచి సీనియర్స్ వరకు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు.