చిన్నారి చికిత్సకు ఆర్థిక సహాయం

చిన్నారి చికిత్సకు ఆర్థిక సహాయం

సంగారెడ్డి: హైదరాబాద్‌లోని అంకురా ఆసుపత్రిలో తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న 11 నెలల శిశువు మోక్షిత్‌కు, పటాన్ చెరువుకి చెందిన సింహ వాహిని ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. సింహ వాహిని ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులతో కలిసి ఆసుపత్రిలో శిశువు తల్లిదండ్రులను స్వయంగా కలిసి, సేకరించిన రూ. 13,300 విరాళాన్ని అందజేశారు.