పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుతో మహిళ మృతి

ELR: పోలవరం మండలం పాత పట్టిసం గ్రామానికి చెందిన జల్లిగంపల శాంత (32) శుక్రవారం పాముకాటుకు గురై మృతి చెందింది. గుంజవరంలోని మొక్కజొన్న తోటలో పనికి వెళ్లిన సమయంలో ఆమెను పాము కాటేసింది. స్థానికులు వెంటనే పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. శాంత మృతితో ఆమె బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.