గురుకుల విద్యార్థులకు ఉపకార వేతనాలు
NRML: నిర్మల్‌లోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నుంచి ఉపకార వేతనాలు లభించాయి. మొత్తం ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి. కవిత సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.