వరద నీటితో అవస్థలు పడుతున్న గ్రామస్తులు
అనకాపల్లి: ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెం మత్స్యకార గ్రామంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామం మధ్యలో నిలిచిపోయిన వరదనీరు కారణంగా దోమలు విజృంభిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. మత్స్యకారులు ఇక్కడే వలలకు మరమ్మత్తులు చేసుకుంటారని పేర్కొన్నారు. తక్షణమే నీటిని తొలగించాలన్నారు.