VIDEO: రైతులకు అందుబాటులో యూరియా: సారిక

NRML: యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని కుబీర్ వ్యవసాయ అధికారిణి సారిక తెలిపారు. మండల రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఎప్పటికప్పుడు అవసరమైన యూరియా బస్తాల లోడ్లు వస్తున్నాయన్నారు. యూరియా కావలసిన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిశీలించి రైతులకు సరిపడా యూరియాను అందిస్తామని పేర్కొన్నారు.