'ఫేషియల్ అటెండెన్స్ రద్దు చేయాలి'
ASR: ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం గిరిజన ప్రాంతాల్లో కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్నదని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇంటర్నెట్ సమస్యలతో హాజరు నమోదు కష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే దినసరి వేతనం రూ.600కు పెంచాలని కోరారు.