తలమడుగు ప్రయాణికుల 'షెల్టర్' కష్టాలు

తలమడుగు ప్రయాణికుల 'షెల్టర్' కష్టాలు

ADB: తలమడుగు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఎండ, వానల నుండి రక్షణ కల్పించే షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్‌లో టాయిలెట్ సదుపాయం కూడా లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. వేసవి కాలం దృష్ట్యా రైల్వే అధికారులు తక్షణమే షెడ్డును నిర్మించాలని కోరుతున్నారు.