17 నుంచి పోషణ మాసం షురూ

NLG: ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లాలోని 2,093 అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పోషణ మాసం నిర్వహించనుంది. ఇందులో పిల్లల్లో ఎత్తు, బరువు కొలతలు చేపట్టి పెరుగదల పర్యవేక్షించాల్సి ఉంటుంది.