రాష్ట్రవ్యాప్తంగా 21న పల్స్ పోలియో

రాష్ట్రవ్యాప్తంగా 21న పల్స్ పోలియో

AP: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు పిల్లలు 54 లక్షల మంది ఉండగా.. 38,267 బూత్‌లలో 61 లక్షల డోస్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్ తదితర ప్రదేశాల్లో పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నట్లు వెల్లడించారు.