VIDEO: రైతుపై గుర్తుతెలియని వ్యక్తుల హత్యాయత్నం
అన్నమయ్య: ఓబులవారిపల్లె(M) కొత్తపల్లిలో బుధవారం అర్ధరాత్రి రవీంద్రారెడ్డిపై గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. పొలంలో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసి దుండగులు పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న రవీంద్రారెడ్డిని కుటుంబ సభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.