ఈ నెల 19లోగా దరఖాస్తుల పరిశీలన జరగాలి: కలెక్టర్

ADB: ఈనెల 19లోగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన జరగాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలసి ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, బ్యాంక్ మేనేజర్లతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో పరిశీలించిన దరఖాస్తుల వివరాలను బ్యాంకులకు పంపించాలని ఆదేశించారు.