అసెంబ్లీ స్పీకర్‌గా అదరగొట్టిన కాకినాడ అమ్మాయి
కాకినాడ: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ'లో జిల్లాలోని శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని ఎస్. స్వాతి 'స్పీకర్'గా వ్యవహరించి సత్తా చాటారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎంపికైన స్వాతి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో సభను హుందాగా నడిపించి ప్రశంసలు అందుకున్నారు.