సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
చెన్నైలో జరుగుతున్న హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు బెల్జియంను 2(4)-4(3) ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తొలి గోల్ బెల్జియందే. 13వ నిమిషంలో గోల్ చేసిన ఆ జట్టు చాలా సేపు 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయినా ఏ మాత్రం పట్టుదల కోల్పోలేదు.