చంద్రుతండాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి

చంద్రుతండాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి

WGL: వర్ధన్నపేట మండలం చంద్రుతండాలో సంత్ సేవలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నీలా రవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ ఆవరణలో సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేశారు. సంత్ సేవాలాల్ సేవలను స్మరించుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తండా నాయకులు పాల్గొన్నారు.