మన్యంగూడెం తండాలో చలివేంద్రం ప్రారంభం
MBNR: బాలానగర్ మండలంలోని మన్యంగూడెం తండాలో వేసవి తాగునీటి సమస్యలు నివారించేందుకు సర్పంచ్ జటావత్ రాజు నాయక్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. చల్లని నీరు అందుబాటులో ఉంచి ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హిర్య నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.