రాధాకృష్ణులను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

రాధాకృష్ణులను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మార్వాడి గల్లీలో శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. స్థానిక అర్చకులు సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.