నిమ్జ్ ఏర్పాట్ల పనులు పరిశీలించిన ఆర్డీవో
SRD: న్యాల్కల్ మండలం రుక్మాపూర్, తండా, ముంగి గ్రామ శివారులో కొనసాగుతున్న నిమ్జ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను RDO దేవుజా పరిశీలించారు. నిమ్జ్ ఏర్పాటు పనుల్లో వేగంపెంచి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా గ్రామాల పరిధిలోని భూముల స్వాధీనం, చుట్టూ ఫెన్సింగ్, మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లు, తదితర అంశాలను ఆయన పరిశీలించారు.