అమృత మహోత్సవాలపై MLA కరపత్రాలు ఆవిష్కరణ
SRD: డిసెంబర్ 7 నుంచి 21 వరకు జరిగే బసవలింగ పట్టదేవర అమృత మహోత్సవాలను జయప్రదం చేయాలని బాల్కి మఠం పీఠాధిపతులు బసవలింగ స్వామి, మాలింగ స్వామి కోరారు. ఖేడ్ పట్టణంలో ఈ మహోత్సవాల కరపత్రాలను స్థానిక ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి, నాగేష్ శెట్కార్‌తో కలిసి గురువారం రాత్రి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో ప్రవచనాలతో పాటు ఉదయం, సాయంత్రం యోగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.