రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు

NRML: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, ఈనాడు సంస్థ అధిపతిగా, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు.