సుప్రీంకోర్టులో ఫొటోలు, వీడియోలు తీస్తే చర్యలు

సుప్రీంకోర్టు ప్రాంగణంలో ముఖ్యంగా హైసెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, వీడియోలు (రీల్స్) తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించింది. ఈ నిర్ణయం భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్నట్లు తెలిపింది. ప్రజలు తరచుగా కోర్టు ఆవరణలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ రీల్స్ చేస్తున్నారని, ఇది భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది.