డుంబ్రిగూడలో ఘనంగా బిర్సా ముండా జయంతి
ASR: డుంబ్రిగూడలో బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడిగా బిర్సా ముండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.