ఫోటోగ్రాఫర్ ఆదర్శవంతమైన నిర్ణయం

ఫోటోగ్రాఫర్ ఆదర్శవంతమైన నిర్ణయం

PDPL: రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సౌతకారి చంద్రకాంత్ తన 44వ పుట్టినరోజు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖని మేదరి బస్తీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తన మరణాంతరం నేత్రదానం చేస్తానని అంగీకార పత్రాన్ని ఓ ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు, అభినందించారు.