'అన్ని సమస్యలు పరిష్కరిస్తాం'

'అన్ని సమస్యలు పరిష్కరిస్తాం'

NRML: ఖానాపూర్ పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ నిర్వహించామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. శనివారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆ కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.