సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ

KDP: పులివెందుల పట్టణంలోని బాకరాపురంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలనుంచి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజలు, వినతి పత్రాలను ఎంపీ అవినాష్ రెడ్డికి అందజేసి వారి సమస్యలను ఆయన కు వివరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.