విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు
ATP: కణేకల్లు గ్రామంలో మద్యం మత్తులో ఆకతాయిలు అర్ధరాత్రి దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేయిని విరగొట్టారు. ఉదయం ఘటన బయటపడడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.