మాజీ రాష్ట్రపతికి ఎంపీ నివాళి

NGKL: భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ జాకీర్ హుస్సేన్ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి శనివారం న్యూఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భారత రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.