హిట్ టీవీ కథనానికి అధికారులు స్పందన
E.G: గోకవరం మండలం కొత్తపల్లిలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నట్లు హిట్ టీవీలో వచ్చిన కథనం సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీడీవో మోతుకూరి గోవిందు బుధవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీ పూడికలు తీయించి రహదారిని శుభ్రం చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.