జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి: ఎంపీ
NLR: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావాలని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, msme అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో msme పథకం కింద పరిశ్రమల ఏర్పాటు, ఇతర వసతులపై చర్చించారు. ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చన్న అంశంపై సమాలోచనలు చేశామన్నారు.