చేప పిల్లల పంపిణీ వేగవంతం చేయాలి: మంత్రి
WNP: చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం నిర్వహించిన సమావేశంలో వనపర్తి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పాల్గొన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని, నవంబర్ 20లోపు అన్ని జిల్లాలలో ప్రక్రియ పూర్తి కావాలన్నారు.