సీఎం సభకు భారీగా తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులు

సీఎం సభకు భారీగా  తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులు

ATP: సీఎం చంద్రబాబు బహిరంగ సభ కోసం తాడిపత్రి మండలం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. యాడికి మార్కెట్ యార్డులో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న సభకు వేలాది మంది కార్యకర్తలు బస్సుల్లో పయనమయ్యారు. పార్టీ శ్రేణుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్తున్నారు.