పాత నేరస్తులపై నిఘా పెట్టండి: సీపీ
WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. గతంలో చోరీలకు పాల్పడిన నిందితుల సమాచారాన్ని, వారి కదలికలను నిరంతరం సేకరించాలని సూచించారు. వారిపై గతంలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత నివాసంపై దృష్టి సారించి నిఘా పెట్టాలని ఆదేశించారు.