నడిగడ్డలో 'రహదారుల' కష్టాలు

GDWL: నడిగడ్డగా పేరుగాంచిన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్ల పరిస్థితి అద్వానంగా తయ్యారయింది. అడుగడుగునా రహదారులు గుంతలతో దర్శనమిస్తూ ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. వారం రోజులగా కురిసిన వర్షాలకు నగరంలో రహదారులు గోతులమయంగా మారాయని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.