'భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం'
సంగారెడ్డి: పోతిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద మంగళవారం భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులు భూ సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకొచ్చారు. సత్వరమే భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహశీల్దార్ జయరామ్ నాయక్ స్పష్టం చేశారు. భూ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ నాయకులు తులసి అన్నారు.