12 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
KRNL: కర్నూలు వన్ స్టాప్ సెంటర్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 12 మంది అభ్యర్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, విధులను నిబద్ధతతో నిర్వహించాలని ఆమె సూచించారు. మహిళలకు అత్యవసర సేవలు, రక్షణ కల్పించడంలో ఈ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.