ఆధునిక వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమం
AKP: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పరిశోధన అధికారులతో సమీక్షించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాలపై చర్చించారు.