హన్మకొండలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

హన్మకొండలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

HNK: నెల్లికుదురు మండలానికి చెందిన నవీన్ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 17 చోరీలకు పాల్పడి, జైలుకెళ్లి వచ్చాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా హనుమకొండ, మట్టెవాడ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో చోరీలు చేశాడు. ఈనెల 23న హనుమకొండ బస్ స్టేషన్‌లో దొంగతనం చేస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 51 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.