ఈనెల10న పీఎల్ ప్రత్యేక డ్రైవ్
సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఈ నెల 10న తపాల జీవిత బీమా(పీఎల్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు పోస్టల్ ఎస్పీ డి. శ్రీహరి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎల్ తప్పనిసరి చేయాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే పథకాలు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ బీమా తీసుకోవని ధీమాగా జీవించాలని సూచించారు.