పవన్ ఉగాది శుభాకాంక్షలు

పవన్ ఉగాది శుభాకాంక్షలు

AP: తెలుగువారికి Dy.CM పవన్ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 'పరాభవో న జ్ఞాతవ్యః - పరాభావానికి దారితీసే పనులు చేయకూడదు' అన్న పెద్దల మాటను గుర్తుచేశారు. భారతీయ పండగలలో కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలిసిన విశిష్టత గోచరిస్తుందన్న ఆయన.. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది అందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.