WPL-2026కు క్రికెటర్ అంజలి శర్వాణి దూరం
KRNL: ఆదోనికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, మోకాలి సర్జరీ కారణంగా WPL-2026 సీజను దూరమయ్యారు. గత మూడు సీజన్లలో యూపీ వారియర్‌కు ప్రాతినిథ్యం వహించిన శర్వాణి, గాయాలతో 8 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ఆమె తండ్రి రమణారావు చెప్పారు. వచ్చే జనవరి నుంచి ఆంధ్ర జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు.