నెల్లూరు జిల్లా టీచర్లకు గమనిక

నెల్లూరు: జిల్లాలోని HMలు, టీచర్లు స్పౌజ్, మ్యూచువల్ ప్రాతిపదికన లీప్ యాప్‌లో అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో డాక్టర్ ఆర్. బాలాజీ రావు సూచించారు. అంతర్ జిల్లాల బదిలీలు, అర్హత వివరాల కోసం deonellore.50.webs.comను చూడాలన్నారు. బదిలీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మున్సిపల్ పాఠశాల టీచర్లు అర్హులని చెప్పారు.