గంగమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన పూజలు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి సమీపంలో గంగమ్మ గుడి నిర్మాణానికి సోమవారం పూజలు నిర్వహించారు . నల్లబెల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో కుమారస్వామి, రాజన్న, లింగయ్య, ఓదెలు, శివయ్య, శీను తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుడి నిర్మాణం సాఫల్యమై, అమ్మవారి ఆశీస్సులు మండల ప్రజలకు లభించాలని ఆకాంక్షించారు.