నిరుపయోగంగా మారిన యోగ కేంద్రం

నిరుపయోగంగా మారిన యోగ కేంద్రం

ASF: వాంకిడి మండల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన యోగ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రాన్ని నిర్మించేందుకు సుమారు రూ. 4.5 లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు. శిక్షకులకు నెలకు రూ. 8 వేలు, మహిళా శిక్షకులకు రూ. 5 వేల పారితోషికం చెల్లించేందుకు కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.