VIDEO: నారా లోకేష్ ఎంపిక అభినందనీయం: మంత్రి

VIDEO: నారా లోకేష్ ఎంపిక అభినందనీయం: మంత్రి

అన్నమయ్య: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎంపిక కావడం ఆనందదాయకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లక్ష్యాలు, చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోతరం నాయకుడిగా అన్ని వర్గాలకు దగ్గరగా పనిచేస్తున్న లోకేష్ కృషి ప్రశంసనీయమన్నారు.